

వినియోగించని సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంక్ ఖాతాను మూసివేయడం వల్ల సాధారణంగా సిబిల్ స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉండదు. ఎందుకంటే డిపాజిట్ ఖాతాల వివరాలు క్రెడిట్ రిపోర్ట్‌లో భాగం కావు. అయితే ఆ ఖాతా నుంచి రుణ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులకు ఆటో డెబిట్ మాండేట్ ఇచ్చి ఉంటే, ఖాతాను మూసివేసే ముందు వాటిని మరో ఖాతాకు మార్చాలి. లేదంటే చెల్లింపులు మిస్ అయ్యే అవకాశం ఉండి, క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
క్రెడిట్ కార్డును మూసివేసే విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఒక కార్డును క్లోజ్ చేస్తే మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. దీంతో క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరగవచ్చు. ఉదాహరణకు మొత్తం క్రెడిట్ పరిమితి రూ.5 లక్షలు ఉండి, రూ.1 లక్ష వినియోగిస్తే క్రెడిట్ వినియోగం 20 శాతంగా ఉంటుంది. రూ.1 లక్ష పరిమితి ఉన్న కార్డును మూసివేస్తే మొత్తం పరిమితి రూ.4 లక్షలకు తగ్గి, వినియోగ నిష్పత్తి 25 శాతానికి పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా నిర్వహిస్తున్న కార్డును మూసివేయడం వల్ల దీర్ఘకాలిక క్రెడిట్ చరిత్ర ప్రయోజనం కూడా తగ్గే అవకాశం ఉంది.
సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో సకాలంలో చెల్లింపులు, నియంత్రిత క్రెడిట్ వినియోగం, క్రెడిట్ ఖాతాల నిర్వహణ, తరచుగా రుణాల కోసం విచారణలు చేయకపోవడం, సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర ఉన్నాయి. అందువల్ల పాత క్రెడిట్ కార్డును మూసివేసే ముందు బకాయిలన్నీ చెల్లించి, అది మీ క్రెడిట్ చరిత్రకు ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలించాలి. వార్షిక రుసుము లేని, సక్రమంగా నిర్వహిస్తున్న కార్డును అవసరమైతే బాధ్యతాయుతంగా యాక్టివ్‌గా ఉంచడం ప్రయోజనకరంగా ఉండొచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!