
బిజినెస్

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రాంగణంలోని ఐదు హోటళ్ల లైసెన్సులను నిలిపివేయడంపై ముంబై హైకోర్టు ఎఫ్డీఏ అధికారుల తీరును తప్పుబట్టింది. ఆహార భద్రతా నిబంధనలను 88 శాతం మేర పాటిస్తున్న హోటళ్లపై వెంటనే సీజ్ వంటి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. అధికారులు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని సూచించింది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ఎఫ్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదని జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలతో పాటు అపరిశుభ్రత, మూడో పక్ష కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను అధికారులు గుర్తించారు. దీనిపై ఎంసీఏ కోర్టును ఆశ్రయించగా, ఐదు ఆహారశాలల లైసెన్సులను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎఫ్డీఏ ఉపసంహరించుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!