
క్రీడలు

బాంబే హైకోర్టు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, చెత్త పారేయడం వంటి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి దేశంలో ఒక విధంగా ‘జాతీయ అలవాటు’గా మారాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, ప్రజా పరిశుభ్రతను కాపాడడంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.250 జరిమానా సరిపోదని అభిప్రాయపడిన హైకోర్టు, దానిని రూ.2,500కు పెంచాలని సూచించింది. కఠిన జరిమానాలు, సమర్థవంతమైన అమలు ద్వారా ప్రజల్లో బాధ్యత పెరిగి, నగరాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!