

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌కు చెందిన భారత సంతతి విద్యార్థిని రిద్ధీ చౌహాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తన పాఠశాలలో నిర్వహిస్తున్న యూఎస్ నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్జేఆర్ఓటీసీ) యూనిట్‌కు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఈ బాధ్యతలో ఆమె సుమారు 300 మంది యూఎస్ నేవీ క్యాడెట్లకు నాయకత్వం వహించనుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమెరికా నేవీ నిర్వహిస్తోంది.
తొమ్మిదో తరగతిలోనే ఎన్జేఆర్ఓటీసీ కార్యక్రమంలో చేరిన రిద్ధీ, అకాడమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ప్లటూన్ లీడర్, ఇన్స్పెక్షన్ కమాండర్ వంటి పలు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి ఈ అత్యున్నత విద్యార్థి నాయకత్వ స్థానాన్ని అందుకుంది. ఇప్పటికే యూఎస్ నేవల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్లో ప్రవేశం పొందిన ఆమె, భవిష్యత్‌లో యూఎస్ నేవీలో చేరడమే తన లక్ష్యమని వెల్లడించింది. రిద్ధీ తల్లిదండ్రులు దిలీప్ చౌహాన్, రుచికా చౌహాన్ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందినవారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!