
క్రీడలు

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశముంది.
గత కేబినెట్ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సవరించిన అంచనాలకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే నిలిచిపోయాయని, అవి మంత్రివర్గం ముందుకు రావడం లేదని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని సమగ్రంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!