
బిజినెస్

బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అతిథుల రాకతో ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటళ్లలో గదులకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా ప్రీమియం హోటళ్లలో రూమ్ అవైలబిలిటీ కూడా గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
పెరిగిన డిమాండ్ ప్రభావంతో హోటల్ రూమ్ టారిఫ్‌లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ తాజ్ హోటళ్లలో సాధారణంగా రూ.1.5 లక్షలుగా ఉండే లగ్జరీ రూమ్ ధరలు కొన్ని సందర్భాల్లో ఏకంగా రూ.15 లక్షల వరకు చేరినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రతినిధుల రాక, కఠినమైన దౌత్య భద్రతా ఏర్పాట్లు, పరిమిత గదుల లభ్యత, భారీ డిమాండ్ ధరల పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!