

తెలంగాణ అసెంబ్లీ సమీపంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై ఈ కేసులు నమోదైనట్లు సమాచారం. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టడం, కాలర్లు పట్టుకోవడం, దూషించడం, బెదిరించడం వంటి ఆరోపణలతో పాటు మహిళా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, మీడియా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!