

బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని, బీఆర్‌ఎస్ పార్టీ కూడా స్పీకర్ పదవిని గౌరవిస్తుందని తెలిపారు. తాత మధు చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం చేశారని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యల వల్ల అపార్థం లేదా బాధ కలిగితే లిఖితపూర్వకంగా తాత మధు విచారం వ్యక్తం చేశారని, అదే అంశంపై బీఆర్‌ఎస్ కూడా విచారం వ్యక్తం చేస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమంపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన హామీలపై స్పష్టత లేదని ప్రశ్నించారు. 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని, ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!