

ఎస్‌ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్స్, యాక్షన్, మైథాలజీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథలో ఎమోషన్‌కు చాలా ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు.
‘వారణాసి’ కథలోని ప్రధాన ఎమోషనల్ కోర్ తండ్రీకొడుకుల మధ్య ఉండే పవిత్రమైన బంధం చుట్టూనే తిరుగుతుందని రాజమౌళి వెల్లడించారు. ఈ బంధమే యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ అంశాలతో కూడిన కథను ముందుకు నడిపించనున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు ఇందులో టైమ్ ట్రావెలర్ ఆర్కియాలజిస్ట్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా జోనాస్ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మహేశ్ బాబు తండ్రిగా, శివ భక్తుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!