
జనరల్

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున ఏపీ నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం, పెరలపాడు – ఎన్ఎస్పీ కాలువ రహదారిపై కీసర సమీపంలో అగ్నికి ఆహుతైంది. ప్రయాణంలో ఉన్న సమయంలో బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందుకున్న జాతీయ రహదారి సిబ్బంది తక్షణమే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!