

ఇంటర్నెట్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ విడుదల చేసిన షాకింగ్ నివేదిక తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 21 దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 2 కోట్ల మంది పిల్లలు ఆన్‌లైన్ లైంగిక వేధింపులు లేదా దోపిడీకి గురయ్యారు. అంటే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు ఇలాంటి వేధింపులకు బాధితుడిగా మారినట్లు నివేదిక వెల్లడించింది.
ఇక దాదాపు 1.5 కోట్ల మంది పిల్లలు అనుచిత కంటెంట్‌కు గురైనట్లు యూనిసెఫ్ తెలిపింది. సుమారు 90 లక్షల మంది లైంగిక చిత్రాలు లేదా లైంగిక సంభాషణలను పంచుకోవాలని ఒత్తిడికి గురయ్యారు. మరోవైపు, దాదాపు 40 లక్షల మంది పిల్లల ప్రైవేట్ చిత్రాలు వారి అనుమతి లేకుండానే ఇతరులతో షేర్ అయినట్లు నివేదిక పేర్కొంది. పిల్లలను డిజిటల్ దోపిడీ నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వాలు, ఆన్‌లైన్ వేదికలు మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!