

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో నిర్మాణాత్మక, నియంత్రణపరమైన సంస్కరణలను ప్రతిపాదించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) సురేష్ ఎన్. పటేల్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠం చేయడం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.
బ్యాంకింగ్ చట్టాలు, నియంత్రణ విధానాల్లో అవసరమైన మార్పులపై కమిటీ సిఫార్సులు చేయనుంది. అలాగే ప్రాధాన్యత రంగ రుణాల (పీఎస్‌ఎల్) విధానం, బ్యాంకుల మూలధన అవసరాలను సమీక్షించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేలా నిర్మాణాత్మక సంస్కరణలపై కూడా సూచనలు ఇవ్వనుంది. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం, సిఫార్సులతో కూడిన నివేదికను 2027 ఏప్రిల్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!