

నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను అందజేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అసలు లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని చంద్రబాబు అన్నారు. బ్యాంకులు స్వయం సహాయక సంఘాలు, రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మహిళలు, వీధి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సీఎం ప్రస్తావించారు. రుణాల రీషెడ్యూలింగ్ ద్వారా రాష్ట్రానికి రూ.1,538 కోట్ల ఆదా జరిగిందని తెలిపారు. డ్వాక్రా మహిళల పొదుపు, రుణాల చెల్లింపులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ, "వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్" కార్యక్రమం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2047 నాటికి ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!