
బిజినెస్

చంద్రుడిపై పరిశోధనల్లో చైనా మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చాంగ్ఈ-7 మిషన్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై ఈ మిషన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. శాశ్వతంగా నీడలో ఉండే ప్రాంతాల్లో నీటి మంచు ఉండే అవకాశాల నేపథ్యంలో.. అక్కడ నీటి ఉనికి, పంపిణీ, లక్షణాలు, భవిష్యత్తులో దాని వినియోగ అవకాశాలపై పరిశోధనలు చేయనున్నారు.
చంద్రుడిపై దీర్ఘకాలిక పరిశోధనలను విస్తరించేందుకు చైనా అంతర్జాతీయ సహకారంపైనా దృష్టి పెట్టింది. రష్యాతో కలిసి సంయుక్త చంద్ర పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికలను రూపొందిస్తోంది. చంద్రుడి వనరులపై అవగాహన పెంచుకోవడంతో పాటు.. భవిష్యత్తులో మరింత అధునాతనమైన మానవ, రోబోటిక్ మిషన్లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో చాంగ్ఈ-7 కీలకంగా మారనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!