

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలోని వివేకానంద కాలనీలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జీహెచ్ఎంసీ పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు.
నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వరద ముంపు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చిన్న వానకే నగరం జలమయం కావడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శిస్తూ, ఈసారి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!