
జనరల్

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల వద్ద మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లు సమాచారం. అణు కేంద్రాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, తమ దేశ ప్రజల డిమాండ్‌ను నెరవేరుస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే ఇరాన్‌పై తీవ్ర ప్రతిస్పందన తప్పదని పేర్కొన్నారు. అవసరమైతే క్షిపణి దాడులకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే భారీ స్థాయిలో క్షిపణులను సిద్ధం చేసి ఉంచినట్లు ట్రంప్ వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!