
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గోదావరి జలాల సమర్థ వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోదం ఇవ్వాలని కోరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాల్సిందిగా, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణలో మౌలిక వసతులు, విద్యా సంస్థలు, పరిశ్రమల అభివృద్ధి వేగవంతం చేయడానికి కేంద్ర సహకారం కీలకమని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!