
బిజినెస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీల్లో 50 శాతానికి పైగా అమలయ్యాయని శాసనసభ హామీల అమలు కమిటీ వెల్లడించింది. కమిటీ వివరాల ప్రకారం మొత్తం 2,266 హామీల్లో 1,092 అమలుకాగా, 1,174 హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 750 హామీలు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవేనని కమిటీ పేర్కొంది.
మంత్రి డి. శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో జరిగిన సమావేశంలో పెండింగ్ హామీల అమలుపై సమీక్ష నిర్వహించారు. మిగిలిన హామీల అమలును వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!