31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండ తొలి దశ జాతికి అంకితం..

Writer: Chandrika 12:52 PM, 31 ఆగస్టు, 2026
వెలిగొండ తొలి దశ జాతికి అంకితం..

మార్కాపురం ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశ సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు.

కృష్ణా జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో మార్కాపురం ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం నిర్వహించిన జలహారతి కార్యక్రమాన్ని సభా ప్రాంగణం నుంచి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గిరిజన మహిళలు చంద్రబాబుకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేశారు. దీంతో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

విడాకుల తర్వాత రెండో పెళ్లిపై తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

విడాకుల తర్వాత రెండో పెళ్లిపై తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

వెలిగొండతో వలసలకు ముగింపు.. అభివృద్ధికి కొత్త ఊపు: నారా లోకేష్

వెలిగొండతో వలసలకు ముగింపు.. అభివృద్ధికి కొత్త ఊపు: నారా లోకేష్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

ట్యాగ్లు
వెలిగొండ ప్రాజెక్టుచంద్రబాబు నాయుడుమార్కాపురంకృష్ణానదిసాగునీటి ప్రాజెక్టుఆంధ్రప్రదేశ్నల్లమలసాగర్జలవిడుదలసాగునీరుతాగునీరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...
జనరల్

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..
క్రీడలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్
సినిమాలు

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం
జనరల్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్
టెక్నాలజీ

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్

వెలిగొండ తొలి దశ జాతికి అంకితం..
జనరల్

వెలిగొండ తొలి దశ జాతికి అంకితం..

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!
షోస్

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి
బిజినెస్

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు
బిజినెస్

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు

రోజర్ ఫెడరర్ భావోద్వేగం..
క్రీడలు

రోజర్ ఫెడరర్ భావోద్వేగం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!