
క్రీడలు

బంగారంపై దిగుమతి సుంకం పెంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన తర్వాత దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు 70 శాతం తగ్గినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. మే 13 నుంచి పెంచిన సుంకం అమల్లోకి వచ్చింది. గతంలో నెలకు సగటున 75-100 టన్నుల బంగారం దిగుమతి కాగా, ఇటీవల నెల రోజుల్లో ఈ పరిమాణం 25-30 టన్నులకు పడిపోయినట్లు వెల్లడించారు.
విదేశీ మారక నిల్వలను పరిరక్షించడంలో భాగంగా కేంద్రం ఈ సుంకం పెంపు నిర్ణయం తీసుకుంది. దిగుమతి వ్యయం పెరగడంతో పసిడి దిగుమతులపై ప్రభావం పడినట్లు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దిగుమతులు గణనీయంగా తగ్గడం దేశీయ బంగారం మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!