
జనరల్

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించి, ఈ టోర్నీలో అర్ధ శతకం నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
అర్ధ శతకం తర్వాత కూడా వైభవ్ అదే దూకుడును కొనసాగించాడు. మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ వద్ద క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. మొత్తంగా 80 బంతుల్లో 92 పరుగులు చేసిన వైభవ్.. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. చిన్న వయసులోనే అదిరిపోయే బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టిస్తున్న వైభవ్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!