
జనరల్

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు రేపు 16 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, జంట నగరాల భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మాత్రమే కాకుండా, ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, సామాజిక ఐక్యతను ప్రతిబింబించే మహోత్సవమని ఆయన పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న మూడు వేలకుపైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని గుర్తుచేస్తూ, బోనాలు తెలంగాణ గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి, లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!