
సినిమాలు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును భారత ఎన్నికల సంఘం (సీఈసీ) పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణకు ఆగస్టు 3, 2026 వరకు గడువు పొడిగించారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనుండగా, వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్‌ను అన్ని అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!