

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తన పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఢిల్లీలో కలిశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ-ఫార్ములా రేసు కేసులో జూలై 31న కోర్టుకు హాజరవుతానని, న్యాయపరంగా పోరాడి కేసు నుంచి బయటపడతాననే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
అదే సందర్భంగా కేటీఆర్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, వచ్చే ఏడాది పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి కేసీఆర్నే అవుతారని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకూడదని, అలాగే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!