

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాకాలంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో నిర్వహించిన వర్షాకాల సన్నద్ధత సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూన్ 9న కురిసిన భారీ వర్షాల సమయంలో నగరంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ముందుగానే పరిగణనలోకి తీసుకుని మున్సిపల్, ట్రాఫిక్, పోలీసు, జలమండలి, హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!