

తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కేశవరావు, కోదండరామ్, రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీలతో జరిపిన సంప్రదింపుల వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం సూచించారు.
ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి డిజిటల్ దరఖాస్తులను స్వీకరించాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు కమిటీ తెలిపింది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్, హెల్త్‌కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ అంశాలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!