
జనరల్

దక్షిణ ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకపై దాడి జరగడంతో నలుగురు మరణించగా, మరో 68 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు అమెరికా దాడే కారణమని ఇరాన్ ఆరోపించింది. దీంతో పెళ్లి వేడుక జరగాల్సిన ప్రదేశం విషాదంతో నిండిపోయిందని పేర్కొంది. ఈ ఘటన ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని అమెరికా సైన్యం కూడా పేర్కొంది. అంతకుముందు, యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఇరాన్ దళాల మాదిరిగా సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం అమెరికా సైన్యానికి అలవాటు లేదని స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!