

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీల కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన అనంతరం చోటుచేసుకున్నట్లు చెబుతున్న ‘ప్యూరిఫికేషన్’ ఘటనపై దళిత, గిరిజన ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం, సమానత్వం, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ నుంచి మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, కడియం కావ్య సమావేశానికి హాజరయ్యారు.
ఘటనపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్న ఎస్సీ, ఎస్టీ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించాలని నిర్ణయించారు. ఘటనపై రాష్ట్రపతి జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ నెల 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఆ రోజు అవకాశం లేకపోతే రాష్ట్రపతికి అనుకూలమైన మరో తేదీలో భేటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ హక్కులు, గౌరవం కోసం సమిష్టిగా పోరాడాలని ఎంపీలు పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!