
షోస్

యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఎయిర్‌పోర్టులో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు తెలియజేశారు.
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందనపై నమోదైన కేసులు, జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!