
షోస్

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేజీఎఫ్ తాలూకా దొడ్డ కరి సమీపంలో ఓ టయోటా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను శారదమ్మ (70), దీక్షిత (25), దేవేంద్ర కుమార్ (41), జిష్ణు (13)గా గుర్తించారు. తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుని బెంగళూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కారులో ప్రయాణిస్తున్న వికాస్, నీతూ, ఆద్విక ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స కోసం బంగారుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన భేతమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!