
షోస్

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్లుగా, వాయిదాల పద్ధతిలో ప్రభుత్వానికి లంచాలు చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో పొందుపరిచిన వివరాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ విలువలో లంచాల మొత్తం 10 శాతం వరకు ఉండేదని పేర్కొన్నారు.
పార్టీ నిధుల పేరుతో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు వసూలు చేసినట్లు ఈడీ పత్రాలు వెల్లడిస్తున్నాయని విజయ్ అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఈ మొత్తాలను వసూలు చేశారని, ఆ సమయంలో అధికారంలో ఉన్నది డీఎంకేనే అని వ్యాఖ్యానించారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితర కీలక నేతలు ఈ వసూళ్లకు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉన్నారని సీఎం విజయ్ ఆరోపించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!