
ఓటీటీ

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో సుమారు పది నెలల పాటు పార్టీ బాధ్యతలకు ఆమె విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్‌చార్జిని ఎంపిక చేసే ప్రక్రియపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.
కొత్త ఇన్‌చార్జి పదవి కోసం పలువురు సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్, దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!