
జనరల్

గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి పూజలు, దర్శనంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, ఉత్సాహం, సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. భగవంతుడి దివ్య ఆశీస్సులతో చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, దేశం నిరంతరం ప్రగతి పథంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తన శుభాకాంక్షలను తెలియజేశారు. మోదక ప్రసాదాన్ని ఇష్టపడే, శిరస్సుపై చంద్రుడిని ధరించిన, భక్తుల కష్టాలను తొలగించే వినాయకుడికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. పండుగ వేళ దేశ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ముగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!