

ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతిని తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం మహాగణపతికి తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమంలో గవర్నర్ శివప్రసాద్ శుక్లా పాల్గొననున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు, పాత పీఎస్ సైఫాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు, నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు రాకపోకలకు ఆంక్షలు విధించారు. రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్, విశ్వేశ్వరయ్య భవన్‌లలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!