
జనరల్

ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) నేత సుప్రియా సూలే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత్ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన మిత్రులను ఎంచుకోగలదని, కానీ పొరుగు దేశాలను ఎంచుకోలేదని ఆమె అన్నారు. అందువల్ల ఇతర దేశాలతో బలమైన, స్థిరమైన సంబంధాలను కొనసాగించడం విదేశాంగ విధానంలో కీలకమని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఏర్పడిన అంతర్జాతీయ సంబంధాలను సుప్రియా సూలే ఉదాహరణగా ప్రస్తావించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మన్మోహన్ సింగ్‌ను గురువుగా అభివర్ణించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. దౌత్యం అనేది కాలక్రమంలో సంబంధాలను నిర్మించుకోవడమేనని, దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సూలే సూచించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!