
జనరల్

దేశవ్యాప్తంగా సైన్స్, సంబంధిత విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించిన సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూలై 17, 18 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన తుది సమాధాన కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసిన అనంతరం, తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఈ పరీక్షకు మొత్తం 1,87,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,50,057 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పాస్‌వర్డ్, భద్రతా పిన్ వివరాలను ఉపయోగించి మార్కుల పట్టికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు తమ ఫలితాల్లో పరిశీలించుకోవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!