
జనరల్

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న కింగ్స్ & క్వీన్స్ పబ్‌లో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మఫ్టీలో ప్రవేశించి అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఆయన వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.
డీసీపీ సమాచారం మేరకు పోలీసులు పబ్‌పై దాడి నిర్వహించి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకోగా, పబ్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!