
సినిమాలు

దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోటీ పరీక్షల్లో పారదర్శకతను కాపాడడంతో పాటు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణలు తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల మోసాలను అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ఈ చట్ట సవరణ లక్ష్యమని కేంద్రం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!