

భారత మాజీ క్రికెట్ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీకి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ పేరుతో పలు బెదిరింపు లేఖలు వచ్చినట్లు సమాచారం. అయితే వాటిని తొలుత పెద్దగా పట్టించుకోలేదు. సోమవారం గంగూలీ కార్యాలయానికి వచ్చిన రెండు లేఖల్లో ఆయనతో పాటు డోనాను హత్య చేస్తామంటూ స్పష్టమైన హెచ్చరికలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గంగూలీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దక్షిణ కోల్‌కతాలోని ఠాకుర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖలు కొరియర్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లేఖల మూలాన్ని తెలుసుకునేందుకు కొరియర్ సంస్థ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే లేఖలకు సంబంధించిన మొబైల్ నంబర్, సిమ్ కార్డు వివరాలను పరిశీలిస్తున్నారు. గత ఆరు నెలల్లో వచ్చిన అన్ని లేఖల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? బెదిరింపులకు కారణమేంటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!