

దిశా శాలియన్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిశ తండ్రి సతీశ్ సాలియన్.. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపినట్లు నివేదికలు వెల్లడించాయి. తన కుమార్తె మృతిపై న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితంగా చిత్రీకరించేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయని సతీశ్ సాలియన్ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పాటు బహిరంగంగా, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని, తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
2020 జూన్ 8న ముంబయిలోని ఓ ఎత్తైన భవనం నుంచి పడిపోవడంతో దిశా శాలియన్ మృతి చెందారు. ఆమె మరణించిన ఆరు రోజుల తర్వాత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా మృతి చెందడంతో రెండు ఘటనల మధ్య సంబంధంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దిశా మృతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. దిశా శాలియన్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమెతో తనకు ఎలాంటి పరిచయం లేదని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. కేసులోని ఆరోపణలు, వివిధ వ్యక్తుల వాదనలు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!