
జనరల్

రష్యాపై అమెరికా తీసుకొస్తున్న ఆంక్షల బిల్లుకు సంబంధించిన పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అమెరికా కాంగ్రెస్ తాజాగా ఆమోదించిన చట్టంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
దేశ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ వనరుల నుంచి ఇంధనాన్ని సేకరించే విధానాన్ని కొనసాగిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ అంశంపై గత కొన్ని నెలల్లో అమెరికా ప్రతినిధులతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపినట్లు తెలిపింది. ప్రతిపాదిత చట్టం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై చూపే ప్రభావంపై తమ ఆందోళనలను అమెరికాకు ఇప్పటికే తెలియజేశామని కేంద్రం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!