
షోస్

ఆంధ్రప్రదేశ్‌లో 807 ఏ4 మద్యం షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 మద్యం షాపులను రెన్యువల్‌కు నోటిఫై చేయగా, గడువు ముగిసే సమయానికి 3,236 షాపులు రెన్యువల్ చేసుకున్నాయి. మరో 414 షాపులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులతో కలిపి మొత్తం 807 దుకాణాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ 807 మద్యం షాపులకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 5న లాటరీ నిర్వహించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!