
జనరల్

దేశ రక్షణలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ డీఆర్డీవో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్, యాంటీ షిప్ వార్ఫేర్ రంగాల్లో ఆధునిక సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించింది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే శక్తిని భారత్ సాధించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
జూన్ 10, 11 తేదీల్లో నిర్వహించిన మూడు ఫ్లైట్ టెస్టుల్లో ఇంటర్సెప్టర్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించి బీఎండీ వ్యవస్థ సామర్థ్యాన్ని నిరూపించాయి. అంతేకాకుండా నావెల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ తొలి పరీక్ష కూడా విజయవంతమైంది. ఈ విజయంతో బీఎండీ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!