

తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. అనంతరం సీఎం లేదా ఆయనకు సంబంధించిన వ్యక్తుల నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
సిద్ధిపేట, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఇందుకు ఉదాహరణలుగా ఈటెల రాజేందర్ ప్రస్తావించారు. భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం కొనసాగుతోందని, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడమే దీని వెనుక ఉద్దేశమని ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు కలెక్టర్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!