
ఓటీటీ

ఎస్‌ఐఆర్ 2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం స్తంభింపజేయగా, ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.
ఇప్పటివరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో 70.02 శాతం పూర్తి అయింది. ధృవీకరణ సమయంలో 89.55 లక్షల మంది ఓటర్లు అనుమానాస్పదంగా లేదా అదనపు పరిశీలన అవసరమైన వారిగా గుర్తించబడినట్లు సమాచారం. వారికి నోటీసులు జారీ చేసి సంబంధిత ఆధారాలు సమర్పించాలని కోరే అవకాశం ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న విడుదల చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!