

భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా ఆగస్టు 4–5 తేదీల్లో తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం, అలాగే బ్రిక్స్ ఆస్తుల పునరుద్ధరణ నిపుణుల నెట్‌వర్క్ సమావేశాన్ని కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖ (DoPT) నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించనుండగా, బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, అవినీతి నిరోధక నిపుణులు, చట్ట అమలు సంస్థల అధికారులు పాల్గొననున్నారు.
సమావేశంలో అక్రమ ఆస్తుల పునరుద్ధరణ, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని అరికట్టడం, పరస్పర సమాచార మార్పిడి, నేరస్థుల అప్పగింత ప్రక్రియలో సహకారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అలాగే "ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ ఆధారిత నైతిక పాలన" అనే ప్రత్యేక కార్యక్రమంలో డిజిటల్ పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా కొనుగోలు వ్యవస్థలు మరియు సాంకేతికత ద్వారా సమర్థవంతమైన పాలనపై సభ్య దేశాలు తమ అనుభవాలను పంచుకోనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!