
జనరల్

హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ కోరారు. బీఆర్కే భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని, బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సహకరించాలని సూచించారు. ప్రజల్లో అపోహలు లేకుండా అవగాహన కల్పించాలని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా సహకరించాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!