

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సెప్టెంబర్ 24న ఈడీ విచారణకు హాజరయ్యారు. హత్యకు ముందు, అనంతరం జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ పరిశీలిస్తోంది.
హత్యకు సంబంధించినట్లు ఆరోపణలు ఉన్న రూ.40 కోట్ల ఆర్థిక ఒప్పందం, నిధుల కదలికలపై కూడా ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. కేసుతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హైదరాబాద్, కడపలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఆర్థిక పత్రాలు, డిజిటల్ పరికరాలు, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!