
రాజకీయాలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సునీల్ యాదవ్‌ను ప్రశ్నించింది. హత్యకు ముందు, అనంతరం జరిగిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.40 కోట్ల నిధుల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. సునీల్ యాదవ్ ఈడీకి బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా సమర్పించారు.
ఇదే కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్గంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. రూ.40 కోట్ల నిధుల వ్యవహారం తనకు తెలియదని, దర్యాప్తులో ఈడీకి పూర్తిగా సహకరిస్తానని సునీల్ యాదవ్ తెలిపినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!