

శీతల వాతావరణానికి ప్రసిద్ధి చెందిన యూరప్ ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, జూన్ 21 నుంచి ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడగా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కూడా నమోదయ్యాయి.
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఈ తీవ్ర వేడిని "నిశ్శబ్ద హంతకుడు"గా అభివర్ణించారు. యూరప్‌లోని ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా నిర్మించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదివారం నాటికి సుమారు 19 కోట్ల మంది ప్రజలు 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు ఆరోగ్య రక్షణ చర్యలు, వేడి నివారణ ప్రణాళికలను మరింత బలోపేతం చేయాలని WHO పిలుపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!